ఓటరు అవగాహన రథం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఓటరు అవగాహన రథం ప్రారంభం

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద గురువారం కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే ప్రతి గ్రామంలో ఓటరుకు అవగాహన కల్పించడం కోసం అవగాహన రథం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రతి ఒక్కరూ ఈ ఓటరు జాబితాలో తమ పేర్లును నమోదు చేసుకునే వీలుంటుందన్నారు. ఈ రథం ద్వారా ప్రజలకు భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సంక్షిప్త ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత విస్తృతం చేయనున్నారు. జిల్లా వాసులంతా ఈ కార్యక్రమానికి సహకరించి తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని, పరిశుభ్రమైన ఓటరు జాబితా తయారీలో పరిపాలనకు సహకరించాలని కోరారు.

చెట్ల నరికివేతపై వృద్ధుడి ఫిర్యాదు

రాయగడ: పర్యావరణ పరిరక్షణ కోసం స్వయంగా నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో ఆవేదన చెందిన ఓ వృద్ధుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన సీనియర్‌ సిటిజన్‌ విష్ణు ప్రసాద్‌ ఖడంగా పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో కొరాపుట్‌ కూడలి పరిసరాల్లో సొంత ఖర్చుతో విలువైన మొక్కలు నాటారు. వాటిలో కొన్ని చెట్లతో పాటు కొరాపుట్‌ కూడలి సమీపంలో ఉన్న ఓ పెద్ద రావి చెట్టును కూడా గుర్తు తెలియని దుండగులు సగం వరకు నరికేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఐఐసీ ప్రసన్నకుమార్‌ బెహరా తెలిపారు. చెట్లు నరకడం నేరమని, పర్యావరణానికి విఘాతం కలిగించే పనులను ఉపేక్షించరాదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement