జయపురం: ఆదివాసీ గ్రామ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. అలాంటి సంఘటన జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఘుమర గ్రామ పంచాయతీ జొడిగుడ గ్రామంలో చోటు చేసుకుంది. చేతబడి చేసి ఆ గ్రామంలో నారాయణ మినరబలియ అనే వ్యక్తి కమలలోచన కరలియ అనే ఒక వ్యక్తిని హత్య చేశారని ఆరోపణ. దీనిపై బొయిపరిగుడ పోలీసులు ఆ గ్రామం వెల్లి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు తెలిపిన విషయం ప్రకారం.. జొడిగుడ గ్రామంలో కమలోచన కరలియ అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు వైద్యం చేసేందుకు మంగళవారం రాత్రి ఆదివాసీ వైద్యుడు నారాయణ మినరబలియను పిలిచారు. దీంతో వైద్యం చేసేందుకు నారాయణ జొడిగుడ గ్రామంలో కమల లోచన ఇంటికి వెళ్లాడు. అతడు వెళ్లిన తర్వాత కమల లోచన అకస్మాత్తుగా మరణించాడు. అయితే నారాయణ మినరబలియ చేతబడి చేసి హత్య చేశాడని కమలలోచన కుటుంబం అనుమానించింది. దీంతో కమల లోచన సోదరుడు హరిబందు కరలియ, తన మిత్రుడు కఠ ఫాలియతో కలిసి నారాయణ మినరబలియ తలపైన, ముఖంపైన కొట్టి కొట్టి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. హత్య చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని నారాయణ మినరబలియ కుటుంబ సభ్యులు బుదవారం డిమాండ్ చేశారు. హత్య జరిగిన జొడిగుడ గ్రామానికి బొయిపరిగుడ పోలీసులు, కొరాపుట్ సైంటిఫిక్ టీమ్‌తో వెళ్లి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.


