ఎంపీ సప్తగిరి ప్రజలను మభ్యపెడుతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ఎంపీ సప్తగిరి ప్రజలను మభ్యపెడుతున్నారు..

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

● రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి ఘాటు విమర్శలు

● రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి ఘాటు విమర్శలు

రాయగడ: జిల్లా రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కి చెందిన కొరాపుట్‌ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలకపై రాజ్యసభ మాజీ ఎంపీ, బీజు స్వాభిమాన్‌ మంచ్‌ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరావు ఘాటు విమర్శలు చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక రాణిగుడఫారంలో గల ఆయన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సప్తగిరిపై విమర్శణా స్త్రాలు సంధించారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో ప్రజలను ఎంపీ సప్తగిరి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాయగడ రైల్వే డివిజన్‌, గుణుపూర్‌–తెరువలి రైల్వే లైన్‌, రాయగడ బైపాస్‌ రహదారి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హోస్టళ్లు, బిజు సేతు వంతెనలు, రెండో కేంద్ర విద్యాలయం వంటి అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టుల డీపీఆర్‌ (డిటెల్‌ ప్రాజెక్టు రిపోర్టు)లు 2016 నుంచే సిద్ధమయ్యాయన్నారు. అయితే 2019లో ఎంపీగా ఎన్నికై న సప్తగిరి ఉలక ఈ ప్రాజెక్టులన్నింటికీ తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకోవడం ప్జరలను మోసం చేయడేమనని విమర్శించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తు ప్రజల్లో అపొహలు సృష్టిస్తోందని నెక్కంటి అన్నారు. ఎంపీ పదవిలో ఉన్నారని, ఆయన జిల్లా అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని సప్తగిరి ఇంకా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎద్దేవా చేశారు. ఇలా ప్రజలను తప్పుదొవ పట్టిస్తే ఆయన ప్రజల ఆదరణను పొగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికై నా ఆయన స్వయంగా ఈ జిల్లాకు చేసే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement