జయపురం: జయపురం సమితి ఛత్రిపుట్ గ్రామంలో ఎలుగు బంట్లు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి దినం సమీప అడవి నుంచి ఎలుగు బంట్లు గ్రామంలోనికి వచ్చి పరిసర పాంతాల్లో ఉన్న పంటలను తిని పాడు చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అటవీ విభాగ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని వాటిని బంధించి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని ప్రజలు కోరగా.. అటవీ విభాగ సిబ్బంది ఎలుగుబంట్లను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సాయంత్రం నుంచి ప్రజలు బయటకు రావద్దని మైక్‌లలో హెచ్చరిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల అటవీ ప్రాంతంలో సరైన ఆహారం తాగునీరు లభించక జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.


