లోక్‌ అదాలత్‌లో 2,498 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 2,498 కేసులు పరిష్కారం

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

పర్లాకిమిడి: స్థానిక జిల్లా కోర్టులో జాతీయ న్యాయసేవా ప్రాధికరణ, ఒడిశా రాష్ట్ర న్యాయసేవా ప్రాధికరణ (కటక్‌) ఆదేశాల మేరకు పర్లాకిమిడిలో రాష్ట్రీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు జగదీష్‌ ప్రసాద్‌ మహాంతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పర్లాకిమిడి, ఆర్‌.ఉదయగిరి, మోహానా, ఆర్‌.ఉదయగిరిలలో మొత్తంగా రాష్ట్రీయ లోక్‌ అదాలత్‌లో 3,835 కేసులకు 2,498 కేసులు విచారించి పరిష్కరించారు. వివిధ జరిమానాలు, నష్టపరిహారాలు ద్వారా రూ. 8,42,425 రూపాయల ఆదాయం సమకూరింది. లోక్‌ అదాలత్‌లో ఫ్యామిలీ కోర్టు జడ్జి డాక్టర్‌ జీవనజ్యోతి రథో, ఆదనపు జిల్లా సెషన్సు జడ్జి బిభూప్రసాద్‌ పండా, సత్యన్నారాయణ పాత్రో, ఆదనపు జిల్లా జడ్జి, మహిళా అదాలత్‌లో విష్ణుప్రియా సామంతరాయ్‌, సత్యసిత్‌ పాణి (జేఎంఎఫ్‌సీ), సౌదామినీ శెఠి (జేఎంఎఫ్‌సీ ఆర్‌.ఉదయగిరి) శుభజిత్‌ బెహారాలు పాల్గొన్నారు.

రాయగడలో 178 కేసులు..

రాయగడ: జిల్లా కోర్టు ప్రాంగణంలోని సివిల్‌ కోర్టులొ శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించారు. బిసంకటక్‌, కాసీపూర్‌, మునిగుడ, గుణుపూర్‌, పద్మపర్‌ కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 178 కేసులను పరిష్కరించి జరిమానా కింద 45,42,681 రూపాయలను వసూలు చేశారు. రెవెన్యూ సంబంధిత 39,916 కేసులతోపాటు మరో 18 ప్రీలిటిగేషన్‌ కేసులను పరిష్కరించిన కోర్టు జరీమనా కింద 2,46,016 రూపాయలను వసూళ్లు చేశారు. జిల్లా జడ్డి సత్యనారాయణ షడంగి నేతృత్వంలో జరిగిన లోక్‌ అదాలత్‌లో ఫ్యామిలీకోర్టు జడ్డి సస్మిత మిశ్రా, ఏడీజే అల్పనా మహాపాత్రో, రాయగడ బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు దేవి ప్రసాద్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement