బాగ్రాగుడలో గాయత్రీ దీప మహాయజ్ఞం | - | Sakshi
Sakshi News home page

బాగ్రాగుడలో గాయత్రీ దీప మహాయజ్ఞం

Mar 15 2026 1:28 AM | Updated on Mar 15 2026 1:28 AM

జయపురం: జయపురం సమితి బాగ్రాగుడ గ్రామ దేవత మందిరంలో 251 కుండీయ గాయత్రీ దీప మహాయజ్ఞం శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ధనపూర్‌, తరగొయి, కలియగాం, సిరాగుడ, తటిబెడ, ఝిలిమిలి, గాడుగుడ గ్రామా ల ప్రజలు అత్యంత భక్తితో ఆరాదించే గ్రామ దేవత గాయత్రీ మహాయజ్ఞంలో వందలాది మంది మహి ళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామ ప్రముఖులచే భూమిపూజ జరిపించి దీప ప్రజ్వళన చేసి సత్‌సంగ్‌ శుభారంభం చేశారు. గా యత్రీ దీప మహాయజ్ఞం ప్రధానంగా జాతి, ధర్మం, వర్ణం, కులం, మత, ప్రాంతాల, భాషా భేదాలు లేకుండా 251 గ్రామాల నుంచి 1008 మంది దేవ దంపతులు, సజ్జనులు సంఘిటితమై 251 కుండీయ గాయిత్రీ మహాయజ్ఞం కొరకు శుభ మూహూర్తపు రాట ప్రతిష్టించారు. కార్యక్రమంలో కొరాపుట్‌ జిల్లా గాయత్రీ పరివార్‌ సమన్వయ కర్త రుతుద్వార పాత్రో, నిరంజన్‌ పాణిగ్రహి, సత్యనారాయణ పాత్రో, గంగాధర పాణిగ్రహి, బాజీ సెట్టి, రశ్మిత శివ, లుకుభొయిలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలు విజయవంతంగా జరిగేందుకు బాగ్రాగుడ గ్రామ ప్రజలు సహకరించారు. పూజలలో బాగ్రాగుడ వార్డు మెంబర్‌ పి.బొడొనాయిక్‌, నిశికాంత పాఢి, ఆయుస్మాన్‌ మహాపాత్రో పాల్గొన్నారు.

మహాయజ్ఞంలో భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement