రైతులకు పరికరాల పంపిణీ
బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి కట్టుబడి ఉందని కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ అన్నారు. జయపురం దసరా పొడియలో శుక్రవారం ప్రారంభమైన మూడుదినాల జయపురం సబ్‌డివిజన్ స్థాయి వ్యవసాయ యంత్రాల మేళాలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ దళబెహర అధ్యక్షతన జరిగిన వ్యవసాయ యంత్రాల మేళలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆర్థిక ఆదాయం పెంచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పరికరాలు తక్కువ ధరకు, సబ్సిడీలో అందజేస్తున్నామన్నారు.
జయపురం


