తల్లి కళ్లెదుటే..కుమారుడు దుర్మరణం
● లారీ ఢీకొని యువకుడు మృతి ● తమ్మాపురం, వల్లభరావుపేట గ్రామాల్లో విషాదఛాయలు
మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ ముదిలిపోడ పంచాయతీలో ఝాటీ పూజలు రెండురోజులు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ తొలి పంటను కొండ దేవతకు సమర్పిస్తారు. ఇళ్లలో మహిళలు పురుషులకు విజయ తిలకం దిద్ది పూజలకు పంపిస్తారు. వీరంతా కర్రలతో కొట్టుకుంటారు.
మల్కన్‌గిరి
రణస్థలం : కన్న తల్లి ఎదుటే కుమారుడు మృతిచెందిన ఘటన రణస్థలం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వు కోటేశ్వరరావు(27) అనే యువకుడు శనివారం ఉదయం తన తల్లి అనసూయకు షుగర్ చెకప్ చేసేందుకు రణస్థలం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆస్పత్రికి 100 మీటర్లు దూరంలోనే విశాఖపట్నం వైపు వెళ్లే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు రోడ్డుపై పడిపోవడంతో అతని పైనుంచి లారీ వెళ్లి పది మీటర్లు ఈడ్చుకుపోయింది. మృతదేహం నుజ్జునుజ్జుగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న తల్లి దూరంగా తుళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడింది. మృతుడు కోటేశ్వరరావు స్వగ్రామం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తమ్మాపురం. కనుమ రోజు అమ్మమ్మ అప్పయ్యమ్మ ఇంటికి తల్లి అనసూయతో కలిసి వల్లభరావుపేట వచ్చాడు. అమ్మమ్మ చనిపోవడంతో మేనమామ సీమల త్రినాథరావు సంక్రాంతి పండుగకు పిలుపు చేశారు. కోటేశ్వరరావుకు అన్నయ్య భాస్కరరావు, చెల్లి త్రివేణి ఉన్నారు. బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా యువకుడు మృతి చెందడంతో ఇటు స్వగ్రామం తమ్మాపురం, అటు అమ్మమ్మ గ్రామమైన వల్లభరావుపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో తల్లి అనసూయ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పురం పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.
తల్లి కళ్లెదుటే..కుమారుడు దుర్మరణం
తల్లి కళ్లెదుటే..కుమారుడు దుర్మరణం


