సీతకొండ జాతరకు పోటెత్తిన భక్తజనం
పర్లాకిమిడి: కనుమ పండుగ నుంచి గుసాని సమితి గారబంద పంచాయతీ పెద్ద కొత్తూరు పంచాయతీలో ఉన్న సీతకొండడపై నిర్వహించిన జాతరకు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తుల పోటెత్తారు. కొండపై సీతాదేవిని దర్శించుకుని ఆంజనేయుని మందిరంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజులపాటు నామయజ్ఞం, అర్ణయజ్ఞం, మృత యజ్ఞం జరుగుతున్నట్టు మహేంద్రగిరి లక్ష్మీబాబా తెలియజేశారు. త్రేతాయుగంలో సీతారాములు, లక్ష్మణసమేత వనవాసం సమయంలో ఈ కొండకు విచ్చేసిన సమయంలో సీతాదేవి రుతుక్రమం జరిగినప్పుడు పుణ్యస్నానం ఈ కొండపై చేసినట్టు స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఈ కొండకు సీతకొండ అని అనాదిగా పిలుస్తున్నారు. ఈ కొండపై రాముడు, ఆంజనేయస్వామి మందిరాలు ఉన్నాయి. చిరకాల స్నేహితులు కనుమనాడు ఈ కొండపై కలుసుకుని సీతా అమ్మవారిని దర్శించుకుంటారు. కొత్తవారు చేరుకుని జతకడితే వారి స్నేహబంధం కలకాలం ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చేరుకొని వివిధ రకాల సామగ్రిని విక్రయిస్తుంటారు. అమ్ముతుంటారు. సీతకొండపై రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా భక్తులను అప్రమత్తం చేశారు.
సీతకొండ జాతరకు పోటెత్తిన భక్తజనం
సీతకొండ జాతరకు పోటెత్తిన భక్తజనం


