తీర్థయాత్రలకు 775 మంది వృద్ధుల పయనం
రాయగడ: సీనియర్ సిటిజన్ తీర్థయాత్ర పథకంలో భాగంగా శనివారం రాయగడ నుంచి 775 మంది వయోవృద్ధులను ప్రత్యేక ట్రైన్‌లో వారణాసి, అయోధ్య తీర్థయాత్రలకు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక హజరవ్వగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, రాయగడ రైల్వే డివిజనల్ మేనేజరు అమితాబ్ సింఘాల్ పచ్చ జెండాను ఊపారు. దక్షిణ, పశ్చిమాంచల్ జిల్లాలైన కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరి, కలహండి, నువాపడ జిల్లాల నుంచి వచ్చిన వయో వృద్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరికి ఎస్‌కార్టుగా మరో 25 మంది ప్రయాణించి వారికి సహకరిస్తారు.
తీర్థయాత్రలకు 775 మంది వృద్ధుల పయనం


