నల్ల బ్యాడ్జీలతో నిరసన
భువనేశ్వర్: స్థానిక క్యాపిటల్ హాస్పిటల్‌లో వైద్యులపై దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. శాంతియుత ఆందోళనకు సంకేతంగా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వ వైద్యులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. వైద్యుల భద్రతా సమస్యలను పరిష్కరించకపోతే ఓపీడీ సేవలను నిలిపివేస్తామని ఈ వర్గం హెచ్చరించింది.
నిందితులను అరెస్టు చేస్తారు
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.అశ్వతి క్యాపిటల్ ఆస్పత్రిని సందర్శించారు. దాడులకు వ్యతిరేకంగా ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్యుల నిరసన పురస్కరించుకుని ఆమె స్పందించారు. వైద్యుల డిమాండ్ ప్రకారం పటిష్టమైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. వైద్యులపై దాడి ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. త్వరలోనే మిగిలిన నిందితులందరినీ అరెస్టు చేస్తారని హామీ ఇచ్చారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన


