స్వర ఝరిలో..
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
–8లోu
భువనేశ్వర్: రాజారాణి సంగీత ఉత్సవం గురువారం సాయంత్రం స్థానిక చారిత్రాత్మక రాజారాణి ఆలయ ప్రాంగణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజారాణి ఆలయ ప్రాంగణం శాసీ్త్రయ సంగీత స్వరాలతో మారు మోగింది. ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక విభాగం, ఒడిశా సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఉత్సవం ప్రారంభించారు. రాజారాణి సంగీత ఉత్సవం భారత దేశపు గొప్ప శాసీ్త్రయ, సంప్రదాయాలకు ఒక సజీవ ప్రతిబింబమని మంత్రి పేర్కొన్నారు. శాసీ్త్రయ, సంప్రదాయ సంగీతం ఒడిశాకు, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రముఖ ఒడిస్సీ సంగీత గురువు అచ్యుత మహరణ, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పండిట్ సురేష్ తల్వాల్కర్, ప్రారంభ సాయంత్రం ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులందరినీ సత్కరించారు. గురు అచ్యుత మహరణ ఆకట్టుకునే ఒడిస్సీ సంగీత కచేరీతో సంగీత ఉత్సవం ప్రారంభమైంది. గురు అచ్యుత మహరణ భావోద్వేగభరితమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. గురు సచ్చిదానంద దాస్ (మర్దల), డాక్టర్ జవహర్ మిశ్రా (వేణువు), గురు మురళీధర్ స్వంయి, మమతా శ్రీచందన్ (తంబురా) చక్కటి వాద్య సహకారం అందించారు. పండిట్ సురేష్ తల్వాల్కర్ తాళ కీర్తనను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అమేయ బిచు (హార్మోనియం), షబరి తల్వాల్కర్, కౌస్తుభ్ స్వంయి (తబలా), ఇషాన్ ప్రమోద్ పరాంజపే (కొనక్కల్), అభిషేక్ భురుక్ (డ్రమ్స్) మరియు నడుక్కండి వినయదాస్ రామదాసన్ (గాత్రం) సహకరించారు. ఒడిస్సీ సంగీతం, తాళ కీర్తన ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ కూడా పెద్ద సంఖ్యలో యువ సందర్శకులను ఆకర్షించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒడియా భాష, సాహిత్యం విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్, ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, మాజీ ఎమ్మెల్యే జయంత కుమార్ షడంగి హాజరయ్యారు.
స్వర ఝరిలో..
స్వర ఝరిలో..
స్వర ఝరిలో..
స్వర ఝరిలో..


