75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం..
● పూండిలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లో భారీ చోరీ ● దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పొందూరు: ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయించే దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ కె.త్రినాథస్వామి అన్నారు. మండలంలో మనగ్రోమోర్, సాయిరాం ట్రేడర్స్ దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకు మాత్రమే ఎరువులను, పురుగు మందులను విక్రయించాలన్నారు. జిల్లాలో రబీలో సాగు విస్తీర్ణం సుమారు 70,310 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 57,230 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వివరించారు. గత ఏడాది మొక్కజొన్న సాగు 14,238 హెక్టార్లు కాగా, ఈ ఏడాది సుమారు 19 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రాగి, నువ్వులు, వేరుశనగ సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంన్నారు. రైతులు ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి విధానం అనుసరించాలని సూచించారు. జిల్లాలో యూరియా వాడకం సుమారు 20 శాతం పెరిగిందని చెప్పారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి ఎం.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : పూండి– గోవిందపురంలోని సాయిరాం వీధిలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు శరత్‌చంద్ర దొర ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు బీరువాను పగలుగొట్టి 75 తులాల వెండి, ఐదున్నర తులాల బంగారం, రూ.90వేలు నగదు పట్టుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి కావడంతో శరత్‌చంద్ర కుటుంబంతో కలిసి పూండి సాయిరాం వీధిలో నివాసం ఉంటున్న అద్దె ఇంటికి తాళం వేసి స్వగ్రామం నందిగాం మండలం బోరుభద్రకు బోగి ముందు రోజు వెళ్లిపోయారు. కుటుంబం ఇంకా అక్కడే ఉండగా శనివారం విధుల్లో చేరేందుకు బోరుభద్ర నుంచి వచ్చిన శరత్ చంద్ర నేరుగా గోవిందపురం సచివాలయానికి వచ్చారు. అక్కడ విధులు ముగించుకుని శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలుగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు విరగ్గొట్టి.. వెండి, బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లి సామాన్లు చిందర వందరగా పడేశారు. అనంతరం వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరత్‌చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు సవాల్..
మూడేళ్లుగా పూండి ప్రాంతంలో దొంగలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ పక్క పాత కేసులు పెండింగ్‌లో ఉండగానే కొత్తగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. గత ఏడాది కూడా పూండి నడిబొడ్డున ఉన్న బంగారం దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే.


