రికార్డు అసిస్టెంట్ పోస్టుల రోస్టర్ పాయింట్‌లో సవరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్ పోస్టు భర్తీకి సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు చేస్తూ సంస్థ చైర్మన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న విడుదల చేసిన నోటిఫికేషన్ నంబర్ 01/2026 లోని రోస్టర్ పాయింట్లలోని రిజర్వేషన్ కేటగిరీని సవరించినట్లు పేర్కొన్నారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి రోస్టర్ పాయింట్ నంబర్ 2లో ఇదివరకు ‘ఎస్సీ’ కేటగిరీగా ఉన్న రిజర్వేషన్‌ను, తాజా సవరణ ప్రకారం ‘ఎస్సీ – గ్రూప్ 1’ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ మార్పు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని అన్ని కోర్టుల నోటీసు బోర్డుల్లోనూ, ఉపాధి కార్యాలయాల్లోనూ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తూరు: కొత్తూరు నాలుగు రోడ్లు కూడలిలోని బత్తిలి రోడ్డులో ఉన్న చెంగల పతివాడ భీమరాజుకు చెందిన శ్రావణి ఫ్యాషన్ రెడీమేడ్ దుస్తుల షాపులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షలు విలువైన దుస్తులు కాలిబూడదయ్యాయి. షాపు మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పండగ పూట షాపు కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
టెక్కలి: రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవా లని కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నా రు. కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ వద్ద బ్రహ్మపురం–విశాఖ (విశాఖ ఎక్స్‌ప్రెస్) రైలు హాల్ట్‌ను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వే శాఖ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సక్రమంగా భూముల రీసర్వే
పలాస: భూముల రీసర్వేను సక్రమంగా చేయాలని, రికార్డుల్లో తప్పుల్లేకుండా చర్యలు తీసుకోవాలని భూరికార్డుల సర్వే సెటిల్‌మెంటు డైరెక్టర్ రోణంకి కూర్మనాఽథ్ (ఐఏఎస్) చెప్పారు. నీలావతి గ్రామంలో శనివారం పర్యటించిన ఆయన రీసర్వేకు సంబంధించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులను కూడా తగిన సలహాలు సూచనలు చేశారు. తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, డీటీ గిరి, ఆర్‌ఐ ప్రసాద్, వీఆర్వో అప్పలనాయుడు ఉన్నారు.
రికార్డు అసిస్టెంట్ పోస్టుల రోస్టర్ పాయింట్‌లో సవరణ
రికార్డు అసిస్టెంట్ పోస్టుల రోస్టర్ పాయింట్‌లో సవరణ


