
పురపాలక లెవనే విజేత
పర్లాకిమిడి: స్థానిక పురపాలక సుపరిపాలన దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో జిల్లా మీడియా అలయెన్సు వెర్సస్ పురపాలక టీం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ క్రికెట్ మ్యాచ్‌ను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేసి తొలుత బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. పర్లాకిమిడి పురపపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి కూడా బ్యాటింగ్ చేసి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మీడియా లెవన్ నిర్ణీత 15 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్‌లో పురపాలక లెవన్ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి విజయం సాధించారు. అంపైర్లుగా మిట్టు పాఢి, శ్రీకాంత్ మహారాణా వ్యవహారించారు. పురపాలక సిబ్బందికి విన్నర్ కప్, మీడియాకు రన్నర్ కప్‌ను ఆగస్టు 31 స్థానిక సంస్థల సుపరిపాలన దినోత్సవం నాడు ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పురపాలక ఈ.ఓ. లక్ష్మణ ముర్ము, జె.ఈ.లు పాల్గొన్నారు.

పురపాలక లెవనే విజేత

పురపాలక లెవనే విజేత