
● రక్తదానం.. ప్రాణదానం
జయపురం: స్థానిక బ్రహ్మకమారి ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యలో జయపురం సోంబారుతోటలో గల బ్రహ్మకుమారి సేవాశ్రమ ప్రాంగణంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 29 యూనిట్ల రక్తం సేకరించారు. బ్రహ్మకమారి ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాన నిర్వాహక రాజయోగిణి డాక్టర్ ప్రకాశమణి 18వ పుణ్యతిథి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బ్రహ్మకమారి ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. జయపురం జిల్లా కేంద్రం హాస్పిటల్ రక్తబండార్ టెక్నీషియన్‌లు రక్త దాతల నుంచి రక్తం సేకరించారు. జయపురం సబ్ డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో రక్తదాతల శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు నిర్వహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు. బ్రహ్మకుమారి సేవాశ్రమ పరిచాలకులు, తదితరులు పాల్గొన్నారు.

● రక్తదానం.. ప్రాణదానం

● రక్తదానం.. ప్రాణదానం