
కిత్తింగిలో ఉచిత వైద్య శిబిరం
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ సమితి బూదర పంచాయతీ కిత్తింగి గ్రామంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హైటెక్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఆదివారం ఉదయం ప్రారంభించారు. కిత్తింగి గ్రామంలో ప్రజలు కొత్త జ్వరాలు, ఒళ్లు, కీళ్ల నొప్పులు వంటి అనేక రోజులుగా బాధపడుతుండటం చూసి హైటెక్ మెడికల్ కళాశాల (భుభనేశ్వర్) నుంచి ఉచిత వైద్య శిబిరంను గ్రామంలో ఏర్పాటుచేశారు. కిత్తింగి, ఖండవ గ్రామాలలో రోగులకు హైటెక్ మెడికల్ నుంచి వచ్చిన డాక్టర్లు అనేక పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ ఉచిత మెడికల్ శిబిరానికి జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్ సగర పంచాయితీ వైస్ చైర్మన్ రఘురాం సాహు, కాశీనగర్ ఎన్.ఏ.సి. డాక్టర్ సౌమ్యరంజన్ దాస్ తదతరులు శిబిరంలో పాల్గోని సహకరించారు.

కిత్తింగిలో ఉచిత వైద్య శిబిరం