
అత్యాధునిక సౌకర్యాలతో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్
అరసవల్లి : జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటులో సింహద్వారం ప్రధాన రహదారిలో మహిళలు, చిన్నారుల వైద్యం కోసం డాక్టర్ శ్రీధర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం స్థానిక మెడికవర్ ఆసుపత్రి పక్కన నూతనంగా నిర్మించిన డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు అత్యంత ప్రావీణ్యత ఉన్న వైద్యునిగా శ్రీధర్ గుర్తింపు పొందారని కొనియాడారు. శ్రీధర్ వంటి అనుభవజ్ఞులైన వైద్యులు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్‌లో వైద్య సేవలను పరిచయం చేయడం జిల్లా ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్, ఆయన కుమారుడు డాక్టర్ దానేటి రూపాంక్, భార్య దానేటి రాధ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, అరకు మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కిమ్స్ అధినేత డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, మెడికవర్ గ్రూప్ ఈడీ హరికృష్ణ, ప్రముఖ వైద్యులు పి.జె.నాయుడు, గూడేన సోమేశ్వరరావు, కె.అమ్మన్నాయుడు, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, టీడీపీ నేత మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.