
శ్రీకృష్ణుని జన్మాష్టమి పురస్కరించుకుని మూడవ రోజు బృందా
● మూన్నాళ్ల ముచ్చటే!
● నిర్మించిన మూడు నెలలకే శిథిలమైన రోడ్డు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో దసమంతపూర్ పంచాయతీ నుంచి పి.మాలిగుడ గ్రామ వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును మూడు కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే రోడ్డు వేసిన కొంత కాలానికే తారు ఊడిపోయి గతుకల మయమైంది. రోడ్డు పరిస్థితి అధికారులకు తెలిపి మరమ్మతులు చేపట్టాలని ఎన్ని విజ్ఞప్తిలు చేసినా చెవిటి వాని మందు శంఖం ఊదిన చందమైందని ప్రజలు ఆరోపించారు. కొద్దిరోజులుగా పడుతున్న వర్షాలతో మూడు కిలో మీటర్ల రోడ్డు గుంతలుగా మారి బురద మయమైంది. దీంతో రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేక పోవటమేనని పి.మాలిగుడ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.