
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణాపాయం
జి.సిగడాం: మెట్టవలస గ్రామ సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రాజాం నుంచి చిలకపాలెం మీదుగా విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వెళ్తున్న పేపర్ వ్యాన్‌ను మెట్టవలస కూడలి వద్ద ఢీకొట్టింది. వ్యాన్‌తో పాటు అటుగా వస్తున్న కారును కూడా ఢీకొట్టింది. వ్యాన్ రోడ్డుపక్కనే ఉన్న ఓ టిఫిన్ దుకాణంలోకి వెళ్లి బోల్తా పడింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుకాణం మాత్రం ధ్వంసమైపోయింది. ఎస్‌ఐ వై.మధుసూదనరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మధుసూధనరావు తెలిపారు.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణాపాయం