
●భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు
రాయగడ: శ్రావణమాసంలో అతి ప్రాముఖ్యత గల రోజైన మూడో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇంటింటా అమ్మవారికి ప్రత్యేక పూజలను మహిళలు చేశారు. రాయగడలోని స్థానిక బ్రాహ్మణవీధి సమీపం ఉన్న కోదండరామ మందిరంలో కుంకుమ పూజలు ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలొ కొనసాగాయి. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పర్లాకిమిడిలో..
శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో సాయంత్రం వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. 50 మంది ముత్తైదవులతో పసుపుకుంకుమ పూజలను పర్లాకిమిడి: వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వరలక్ష్మి పూజలు ప్రధాన పూజారి వనమాలి మణి శర్మ గావించారు. అలాగే ఉదయం ఉమారామలింగేశ్వర ఆలయంలో పార్వతీదేవి, లలితాదేవి ఆలయాలలో పూజారి దుర్గాబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు చేయించారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ముత్తైయిదవులకు చీరలు, తాంబూలాలు అందజేశారు.

●భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు

●భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు

●భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు