రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని జిల్లాలొని కొలనార పంచాయితీలొని కెవుటిగుడ గ్రామానికి చెందిన రాకేష్ ఒటక (19) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలొ చదువుతున్న రాకేష్ బైకుపై వ్యక్తి గత పనుల కోసం కెవుటిగుడ నుంచి జేకే పూర్‌కు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ఒంటామడ వద్ద గల పార్వతీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని ఒక వాహనం ఢీకొని వెళ్లిపొయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై రాకేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.


