మల్కన్‌గిరి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో మహిళలపై దాడులు చాలా ఘోరంగా పెరిగిపోయావని మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద పాత్రో ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై దాడులు పెరగడంతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పావన్నారు. పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వ విఫల్యానికి నిరసనగా ఈ నెల 27వ తేదీన భువనేశ్వర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభను ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు జి. శ్రీనివాస్‌రావు , కోరాపుట్ మాజీ ఎమ్మెల్యే కృష్ణచంధ్ర సోగాడియా, మాలమాడీ, పి.కేసురావు పాల్గొన్నారు.