
సామాజిక కార్యకర్త త్రిపాఠికి పురస్కారం ప్రదానం
కొరాపుట్: సామాజిక కార్యకర్త కాధంబని త్రిపాఠికి హనరింగ్ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం జరిగిన ఒడిశా ఫుడ్ ఆండ్ క్రాఫ్ట్ మేళా–2025లో ఈ పురస్కారం అందజేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి చెందిన కాధంబని త్రిప్రాఠి మహిళల హక్కుల కోసం పోరాడుతూ మాఘరో మహిళా స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. సామాజిక న్యా యం కోసం ఓడిశాలో పోరాడుతున్నందుకు హనరింగ్ ఎక్స్‌లెన్సి అవార్డు అందజేశారు.
కస్తూరీ నగర్‌లో చోరీ
రాయగడ: స్థానిక కస్తూరీ నగర్ 11వ లైన్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటిలో చొరబడి ఇంటిలో గల బీరువాలను విరగ్గొట్టి అందులో గల 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.70 వేల నగదును దొంగిలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కస్తూరీ నగర్ 11వ లైన్‌లో నివసిస్తున్న అమూల్య చంద్ర సాహు అనే వ్యక్తి తన కుటుంబంతో కలసి కుంభమేళాకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్న జగత్ జ్యోతి సాహు ఆరోగ్య రీత్యా వైద్యపరీక్షలను నిర్వహించుకునేందుకు శ్రీకాకుళం వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగుల ఇంటిలో గల 40 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీ చేశారు.
పదో లైన్‌లో..
గత కొద్ది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉన్న గీతాంజలి పాత్రో కుటుంబీకులు షిర్డీ యాత్రకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేకపొవడంతో ఇంటిలొ గల 100 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆమె బంధువులు పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు మూడు దొంగతనాలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనల్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీ ఘటనలు స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment