మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత

Jun 17 2024 1:56 AM | Updated on Jun 17 2024 1:56 AM

మాజీ

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత

భువనేశ్వర్‌: రాష్ట్ర మాజీ గవర్నర్‌ మురళీధర్‌ చంద్రకాంత భండారే(95) శనివారం కన్ను మూశారు. ఆయన మృతి పట్ల ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ రఘుబర దాస్‌, ముఖ్యమంత్రి చంద్రమోహన్‌ మాఝీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. భండారే రాష్ట్ర ప్రజల ప్రియతమ గవర్నర్‌గా మన్ననలు పొందారు. ప్రధానంగా చిన్న పిల్లలతో ముచ్చటించి ఆయన సాధారణ ప్రజానీకానికి చేరువయ్యారు. 2007 ఆగస్టు 21 నుంచి 2013 మార్చి 9 వరకు గవర్నరుగా కొనసాగారు. 1928 డిసెంబరు 10న జన్మించిన భండారే రాజనీతిజ్ఞుడుగా పేరుగాంచారు. 1980 నుంచి 1995 వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహారాష్ట్ర రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదిగా రాణించారు. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌కు వరుసగా రెండు సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

బండారు ఘరణి మందిరానికి కొత్త సొబగులు

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ఏకై క శక్తి పీఠం బండారు ఘరణి మందిరం సరికొత్తగా దర్శనమిస్తోంది. శనివారంతో మరమ్మతులు పూర్తవ్వడంతో పరదాలు తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెద్దపురం మేస్త్రులు ముఖద్వారం నిర్మించగా నయాగడ్‌ జిల్లా శిల్పులు కొత్త రంగులు వేశారు. దాంతో శిఖరం అద్భుతంగా దర్శనమిస్తోంది. ప్రభుత్వం అందజేసిన రూ.90 లక్షల నిధులతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. దాంతో భక్తులు దేవాలయ సందర్శనకు తరలివస్తున్నారు.

గంజాయి పట్టివేత

కొరాపుట్‌/జయపురం: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ ఎస్‌డీపీఓ కార్యాలయం పరిధిలోని పాడువ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా చటువ సమీపంలో గంజాయి అక్రమ రవాణాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి పరిశీలించగా పులికుండ అటవీ ప్రాంతంలో గంజాయి గుర్తించారు. పిచ్చి మెక్కల మధ్య దాచిన 220 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ టి.సబర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి స్లగ్మర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కార్యకర్తలకు పరామర్శ

కొరాపుట్‌: అనారోగ్యం పాలైన బిజూ జనతా దళ్‌ కార్యకర్తలను పార్టీ నబరంగ్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ చంద్ర మజ్జి పరామర్శించారు. నబరంగ్‌పూర్‌ జిల్లా చందాహండి సమితి కుడి గ్రామానికి చెందిన ధనా నాయక్‌ కొంతకాలంగా ధనా నాయక్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన్ను శనివారం రమేష్‌ పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు.

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత 1
1/2

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత 2
2/2

మాజీ గవర్నర్‌ భండారే కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement