
వ్యాపార ప్రత్యర్థిపై దాడి
భువనేశ్వర్: గంజాం జిల్లాలో శుక్రవారం మరో ఎన్నికల వివాదం చెలరేగింది. వ్యాపార ప్రత్యర్థిపై దాడి చేసిన ఆరోపణ కింద కాంగ్రెసు టిక్కెట్టుపై పోటీ చేస్తున్న అభ్యర్థిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో గంజాం జిల్లా దిగొపొహండి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సాకా సుజిత్ కుమార్ అరైస్టెయ్యారు. ఘటనపై బరంపురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్థక్ షడంగి మాట్లాడుతూ దాడిలో సిహాలాకు చెందిన సుధాంశు సంగ్రామ్ పాఢి అనే బిల్డర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. కుకుడాఖండి ప్రాంతంలోని ఒక ప్లాట్‌లో పని చేస్తున్న సుధాంశు సంగ్రామ్ పాఢి సిబ్బందిపై కొందరు దుండగులు దాడి చేశారు. పాఢి మరియు అతని సిబ్బంది ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లుండగా, కాంగ్రెస్ అభ్యర్థి, అతని వ్యక్తులు వారిపై దాడి చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సహచరుడు కె.అమిత్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
దిగపహండి కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్