దేశంలో మూడో ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు | - | Sakshi
Sakshi News home page

దేశంలో మూడో ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు

Apr 13 2023 12:00 PM | Updated on Apr 13 2023 12:08 PM

- - Sakshi

భువనేశ్వర్‌: దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులలో రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ మూడో అత్యంత ధనవంతుడని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్‌మ్స్‌(ఏడీఆర్‌) బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం నవీన్‌ రూ.63.87 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇందులో రూ. 23,26,555 విలువైన చరాస్తులు, రూ.63,64,15,261ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. స్వీయ ఆదాయం రూ.21.17 లక్షలు కాగా, అతని అప్పులు రూ.15 లక్షలని ఏడీఆర్‌ తెలిపింది. గత సంవత్సరం చర, స్థిరాస్తులకు సంబంధించి పట్నాయక్‌ ప్రకటించిన ప్రకారం 2021 డిసెంబర్‌ 31నాటికి ముఖ్యమంత్రి వద్ద రూ.94.41 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంది.

అతనికి భారతీయ స్టేట్‌బ్యాంకు, జన్‌పథ్‌, న్యూఢిల్లీ బ్రాంచ్‌, పార్లమెంట్‌ హౌస్‌ బ్రాంచ్‌, భువనేశ్వర్‌ శాఖల్లో మూడు ఖాతాలు ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. గంజాం జిల్లా హింజిలికాట్‌ కాలేజ్‌ క్యాంపస్‌ బ్రాంచ్‌లో 2, బర్‌గడ్‌ జిల్లా పదంపూర్‌ బ్రాంచ్‌లో ఒక ఖాతా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సాధారణ ఎన్నికల ప్రయోజనాల కోసం వర్తించిన ఖాతాలుగా నివేదిక తెలియజేసింది. ముఖ్యమంత్రుల సగటు ఆస్తులు: రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తుల విలువ రూ.33.96 కోట్లు. కోటీశ్వరుల ముఖ్యమంత్రులు: 30 రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులలో 29 మంది(97%) కోటీశ్వరులు. దేశవ్యాప్తంగా 9మంది ముఖ్యమంత్రులు రూ.కోటి, అంతకంటే ఎక్కువ అప్పులు ప్రకటించారు.

చరాస్తులు..
నవీన్‌ పట్నాయక్‌ చరాస్తులలో పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ రూ.5,033, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.1.11 కోట్లు, భారతీయ రిజర్వు బ్యాంకు బాండ్లు రూ.9 కోట్లు, పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్‌ రూ.కోటి 34 లక్షల విలువైన ఆభరణాలు, రూ.6,434 విలువ చేసే అంబాసిడర్‌ కారు(1980 మోడల్‌) ఉన్నాయి.

స్థిరాస్తులు..
దాదాపు రూ.9,52,46,190ల విలువైన నవీన్‌ నివాస్‌లో మూడింట రెండు వంతుల వాటా, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్‌, న్యూఢిల్లీలో రూ.43,36,18,000 విలువైన ఆస్తిలో 50శాతం వాటా ఉంది. ఈ రెండు వారసత్వ ఆస్తులుగా పేర్కొన్నారు. రూ.510 కోట్ల సమగ్ర ఆస్తులతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రూ.163 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement