అత్యాధునిక సీసీ కెమెరాలతో తప్పిపోయిన మహిళ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అత్యాధునిక సీసీ కెమెరాలతో తప్పిపోయిన మహిళ గుర్తింపు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

అత్యాధునిక సీసీ కెమెరాలతో తప్పిపోయిన మహిళ గుర్తింపు

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల నిఘా సాయంతో తప్పిపోయిన ఓ మతిస్థిమితం లేని మహిళ ఆచూకీని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం ఉయ్యూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం నగరంలోని సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే సోమవారం సాయంత్రం ఆమె ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె కుమారుడు సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తక్షణమే స్పందించిన సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్‌ చవాన్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వి.దుర్గారావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్టేషన్‌ పరిధిలోని అత్యాధునిక సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, సదరు మహిళ ఒక ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో నంబరు ఆధారంగా ఆమె ఆచూకీని కనుగొని క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, ఆధునిక సాంకేతికతను వినియోగించి మహిళను సురక్షితంగా కాపాడిన కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వి.దుర్గారావు, ఇన్‌స్పెక్టర్‌ చవాన్‌, వారి సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement