మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరానికి చెందిన వడ్లమూడి రెయాన్, తాళ్లపాక నాగసాయి భరత్ ఈ నెల 24 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగనున్న జాతీయస్థాయి అండర్–11 బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి మినీ అండర్–11 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ జోడీ విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి డాక్టర్ పి.అంకమ్మ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ హాలులో జరిగిన కార్యక్రమంలో రెయాన్, సాయి భరత్‌లను అంకమ్మ చౌదరితో పాటు కేడీబీఏ కార్యదర్శి ఎం.ఎస్.ఎన్. ప్రసాద్, కోచ్ వి.గంగాధర్, పలువురు బ్యాడ్మింటన్ క్రీడా కారులు అభినందించారు.


