తల్లీబిడ్డలను కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డలను కాపాడిన పోలీసులు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): బిడ్డతో సహా తల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన మహిళ కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు మంగళవారం ప్రకాశం బ్యారేజ్‌ సమీపంలోకి వచ్చింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన స్థానికులు 112కి కాల్‌ చేసి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన కంట్రోల్‌ రూం ఇన్‌స్పెక్టర్‌ ఎం.వి దుర్గారావు వెంటనే వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ గుణరామ్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన ఆయన కానిస్టేబుల్‌ గురువులు, హెడ్‌ కానిస్టేబుల్‌ అబ్దుల్‌ జలీల్‌లను అక్కడికి పంపారు. వారు ఆ మహిళను, పాపను గుర్తించి ఆత్మహత్యాయత్నం చేయకుండా రక్షించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మహిళతో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై మహిళ ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన కంట్రోల్‌ రూం ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ గుణరామ్‌తో పాటు వారి సిబ్బందిని నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement