విజయ డెయిరీలో తర్జన భర్జన | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీలో తర్జన భర్జన

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

విజయ డెయిరీలో తర్జన భర్జన

బోర్డు అత్యవసర సమావేశం

రేపటికి వాయిదా

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఐదుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై విజయ డెయిరీలో తర్జనభర్జన నెలకొంది. దీనిపై చర్చించేందుకు మంగళవారం ఉదయం విజయ డెయిరీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. అయితే కోరం సరిపడా లేకపోవడంతో సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఈ సమావేశానికి విజయ డెయిరీ ఎండీతో పాటు మాజీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులుతో పాటు తొమ్మిది మంది పాల్గొన్నారు. కోర్టు తీర్పుపై లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్దామని భావిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లాలా? కోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలా అన్న విషయంపై బుధవారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

టీడీపీ ఆదేశాల మేరకే తప్పుకొన్న..

సమావేశం వాయిదా పడిన తర్వాత మాజీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ తాజా పరిణామాలపై చర్చించామని, కోరం లేక, సమావేశం బుధవారానికి వాయిదా వేశామన్నారు. బోర్డు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కోర్టు తీర్పుపై కూడా సుదీర్ఘంగా చర్చించామన్నారు. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ రైతుల సంస్థ ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుంటామన్నారు. తెలుగు దేశం పార్టీ నిర్ణయం మేరకు పదవి నుంచి తప్పుకున్నానని, ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కారం చేయాలనే అంశంపై బుధవారం స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement