ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న అన్ని ఏటీఎస్ కేంద్రాల తనిఖీ విధానాలపై స్వతంత్ర, సమగ్ర విచారణ జరపాలి.
ప్రతి కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది విద్యార్హతలు, సాంకేతిక శిక్షణ, అనుభవం, నియామక అర్హతలను పరిశీలించాలి.
వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించిన రికార్డులు, పరీక్షా ఫలితాలు, సీసీటీవీ దృశ్యాలు, డిజిటల్ లాగ్‌లు, జారీ చేసిన సర్టిఫికెట్లను తనిఖీ చేయాలి.
వాహనాలను సక్రమంగా పరీక్షించకుండా, డబ్బులు తీసుకుని అక్రమంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై ఆధారాలతో విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఏటీఎస్ కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ, సిబ్బంది అర్హతలు, పర్యవేక్షణ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన నిబంధనలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి.
పరీక్ష కేంద్రాల పనితీరును రవాణా శాఖ నిరంతరం పర్యవేక్షించేలా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ఏటీఎస్ కేంద్రాల్లో అవకతవకలపై చర్యలు తీసుకుని, తగిన సంస్కరణలు చేపట్టాలి.
కార్పొరేట్‌ల చేతుల్లో ఫిట్‌నెస్ కేంద్రాలు ఒక్కో వెహికల్‌కు రూ.10 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు జిల్లాలోని వాహనాలన్నీ ఒకే చోటకు రావాల్సిన పరిస్థితి
వాహన సంఘాల డిమాండ్‌లు ఇవే
భద్రత మాటున బాదుడు
ఫిట్‌నెస్ పరీక్షలా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు వాహనదారులకు ఆర్థిక భారమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తీసుకొచ్చిన ఏటీఎస్ (ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్) విధానం ఇప్పుడు అదనపు వసూళ్లకు వేదికగా మారిందని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో కార్పొరేట్‌లు దోపిడీ చేయడం మినహా ప్రయోజనం ఏమీ లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ టెస్టింగ్‌తో కచ్చితమైన ఫిట్‌నెస్ పరీక్షలు చేస్తామని చెబుతున్నా, గతంలో కంటే ఏటీఎస్ కేంద్రాలు వచ్చిన తర్వాతే రోడ్డు ప్రమాదాలు పెరిగాయంటున్నారు. జిల్లాలోని వాహనాలన్నీ ఒకే చోటకు రావడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతుందంటున్నారు. ఏటీఎస్ కేంద్రాల అవినీతిపై కోర్టును సైతం ఆశ్రయించేందుకు వాహన సంఘాల ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహన యజమానులు కోరుతున్నారు.
జిల్లా అంతా ఒకేచోట
గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడతో పాటు, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట ఇలా ఏడెనిమిది కేంద్రాల్లో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు చేసేవారు. ఇప్పుడు మొత్తం ఒకేచోట నున్నలో ఏటీఎస్ ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల వాహనాలు అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తిరువూరు వంటి దూర ప్రాంతాల వారు పనులు మానుకుని రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన అక్రమ వసూళ్లు
గతంలో ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ ఫరీక్షలు చేసినప్పుడు ప్రభుత్వ చలానా ఇతర ఫీజులు వంటి వాటితో కలిపి రూ. 3 వేల నుంచి రూ.5 వేల మధ్య ఖర్చు అయ్యేదంటున్నారు. ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకూ అవుతుండటంతో భారంగా మారిందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహన ఫిట్‌నెస్ తనిఖీలకు నిర్ణయించిన ఫీజులకు అదనంగా ఆటోలకు రూ. 900, కార్లుకు రూ. 2 వేల నుంచి రూ. 3వేలు, లారీలు, బస్సులు అయితే రూ. 6 వేల నుంచి రూ. 15 వేల వరకూ వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదేమంటే ఆన్‌లైన్ తనిఖీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించామంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఇలా..
గతంలో రవాణా శాఖకు చెందిన అర్హత కలిగిన అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించేవారు. వాటి సాంకేతిక పరిస్థితి, చాసిస్, ఇంజిన్ నంబర్, బ్రేకులు, లైట్లు, టైర్లు, స్టీరింగ్, సస్పెన్షన్, వాహన నిర్మాణం, భద్రతా పరికరాలు తదితర అంశాలను తనిఖీ చేసేవారు. అనంతరం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రైవేట్ నిర్వహణలోని ఏటీఎస్ కేంద్రాల్లో వాహనాల తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ పనిచేసే సిబ్బందికి తగిన సాంకేతిక అర్హతలు, శిక్షణ, వాహనాల నిర్మాణంపై పరిజ్ఞానం ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వాహన యజమానులు అందున్నారు. కొన్ని కేంద్రాల్లో వాహనాలను కనీస స్థాయిలో కూడా తనిఖీ చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


