అపరిశుభ్ర పరిసరాలు, నాసిరకం కూరగాయలు వినియోగిస్తున్న వైనం తీరు మార్చుకోవాలన్న ఫుడ్ కంట్రోల్ అధికారులు లేకుంటే కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పెట్టే ఆహారం తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఆహార తనిఖీ అధికారులు మండిపడ్డారు. నాసిరకం కూర గాయలు వినియోగిస్తున్నట్లు వారు గుర్తించారు. మరిన్ని లోపాలు వారి తనిఖీల్లో బయట పడ్డాయి. వాటిని సరిదిద్దుకోవాలంటూ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్కంట్రోలర్ శ్రీనివాసరావు తెలిపారు.
లోపాల పుట్ట
జీజీహెచ్లో రోగులకు పెట్టే ఆహారం నాణ్యతగా ఉండటం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో గత నెల 7న ‘పెట్టింది తిను.. అడగొద్దు మెనూ’ కథనం కూడా ప్రచురితౖమైంది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పెడుతున్న ఆహార నాణ్యతను జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై మండిపడ్దారు. కూరగాయలు ఎండిపోయి ఉండటాన్ని గుర్తించారు.
కాంట్రాక్టర్కు నోటీసులు
తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలంటూ డైట్ కాంట్రాక్టర్కు ఫుడ్ కంట్రోల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సరిదిద్దుకోకుంటే కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేస్తామంటూ పేర్కొన్నారు. కిచెన్ పరిశుభ్రంగా ఉంచాలని, ఆహారం తయారు చేసేందుకు నాణ్యమైన కూరగాయలు సరుకులు వినియోగించాలని నోటీసుల్లో తెలిపారు.


