● కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
మైలవరం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 7వ తేదీన కట్టు దిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మైలవరం, రెడ్డిగూడెం, మండలాలకు మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌ల భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


