వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరం

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరం మణిపాల్‌ హాస్పిటల్‌లో ఆస్ట్రేలియా వీసా వైద్య పరీక్షలు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం బాపులపాడు మండలంలో విస్తృతంగా సాగుతోంది. గ్రామగ్రామాన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు శనివారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. మండలంలోని దంటగుంట్లలో కాకులపాడు సెగ్మెంట్‌ వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యరి బట్టు ఆనందరావు, బాపులపాడు– 4 సెగ్మెంట్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆదివిష్ణు సుధారాణికి మద్దతుగా పార్టీ మండల అధ్యక్షుడు ఆవిర్నేని శేషగిరిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మల్లవల్లిలో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అచ్చి శ్రీనివాసరావు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

వీరవల్లి– 1 సెగ్మెంట్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దూసరి నిర్మలకి మద్దతుగా శాలివాహన కాలనీలో కోడెబోయిన బాబి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాపులపాడు– 3 సెగ్మెంట్‌లో ఎంపీటీసీ అభ్యర్థి యర్రపాటి గోవింద్‌కు ఎన్నికల ప్రచారం చేశారు. రేమల్లేలో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తొమ్మండ్రు శేఖర్‌ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాడేపల్లి రూరల్‌: ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించేందుకు తాడేపల్లిలోని మణిపాల్‌ హాస్పిటల్‌కు అధికారిక గుర్తింపు లభించినట్లు హాస్పిటల్‌ డైరెక్టర్‌ జె. రామాంజనేయరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర తెలుగు ప్రాంతాల నుంచి ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై తమ వైద్య పరీక్షల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొ న్నారు. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం నిర్వహించే ఆరోగ్య పరీక్షల్లో 501, 502, 704, 707 కేటగిరీలకు సంబంధించిన పరీక్షలతోపాటు, వీసా మెడికల్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా అవసరమైన ఇతర డయాగ్నస్టిక్‌ పరీక్షలను కూడా ఆసుపత్రిలో నిర్వహిస్తారని వివరించారు. ఆస్ట్రేలియాలో స్ధిరపడిన దాదాపు లక్ష మంది దాకా గల తెలుగు ఎన్‌ఆర్‌ఐలకు, వారి కుటుంబాలకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య పరీక్షలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటు లో ఉంటాయని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ సేవలు ఉండవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement