కంకిపాడు: అర్నబ్ తుపాను ప్రభావంతో ఏర్పడిన పంట నష్టాన్ని సమర్థంగా రూపొందించాలని జిల్లా వ్యవసాయాధికారి కె.జ్యోతిరమణి అన్నారు. మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. తుపాను ప్రభావంతో నేలవాలిన వరిపైరును పరిశీలించారు. పంట నష్టం విస్తీర్ణం, పంట దిగుబడులపై ప్రభావం తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుపానుతో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతిరమణి మాట్లాడుతూ పంట నష్టం అంచనాలను రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు పరిహారం అందేలా చూస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి వెలివెల ఉషారాణి, రైతులు పాల్గొన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో స్టూడెంట్ అఫైర్స్ డీన్ సంపత్‌కుమార్ బృందం పర్యటించింది. గ్రామంలో నేలవాలిన వరి పొలాలను పరిశీలించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశీలనలో బృంద ప్రతినిధులు ఎంవీఎస్ నాయుడు, డాక్టర్ డి.మోహన్‌రెడ్డి, డాక్టర్ యు.విజయ్‌భాస్కర్ రెడ్డి, ఏఓ ఉషారాణి పాల్గొన్నారు.


