పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. సవరించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. పోలింగ్‌ తేదీ నవంబర్‌ 5వ తేదీ గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. నవంబర్‌ 6న అవసరమైన చోట్ల రీపోలింగ్‌ ఉంటుందన్నారు. నవంబర్‌ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. అదే రోజు లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఒకే రోజున ఉండటంతో పోలీసు, పోలింగ్‌ సిబ్బంది, ఇతర అవసరమైన వనరుల సమర్థ వినియోగం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఎన్నికల తేదీలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులు ఆయన సూచించారు. దుర్గగుడి ఘాట్‌రోడ్డు పరిశీలన ఏఎన్‌యూలో ముగిసిన వర్క్‌షాప్‌

వివరాలు వెల్లడించిన

జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ ఈవో శీనానాయక్‌, ఇంజినీరింగ్‌ అధికారులు బుధవారం పరిశీలించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ప్రాంగణం, డోనర్‌సెల్‌, ఓం టర్నింగ్‌ కొండ మలుపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఘాట్‌రోడ్డులో దసరా ఉత్సవాలకు ముందు కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ కొంత మట్టి, కొండ చరియలు విరిగిపడటాన్ని గుర్తించారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే కొండ చరియలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయాన్ని, గణపతి ఆలయాన్ని సందర్శించారు. వర్షం కురిసిన ప్రతి సారి ఆలయంపై నుంచి నీరు జాలు వారడంతో ఇబ్బందికరంగా ఉందని ఆలయ అర్చకులు ఈవో శీనానాయక్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యకు గల కారణాలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈవో శీనానాయక్‌, ఈఈ ఎల్‌.రమాను ఆదేశించారు. ఈవో వెంట డీఈ అశోక్‌కుమార్‌, ఏఈ సాయి ఉన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని నృత్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రుతి మాతా, లయ, పిత – సంగీతం, లయ, నృత్యాల సమగ్ర అధ్యయనంపై ఒకరోజు అకడమిక్‌ వర్క్‌షాప్‌ ముగిసింది. ఆచార్య నాగా ర్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వ హించిన ఈ కార్యక్రమం ద్వారా సంగీతం, లయ, నృత్యాల మధ్య ఉన్న అంతర్లీన సంబంధాలను వివరించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఇన్‌చార్జి వీపీ ఆచార్య కె.గంగాధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెక్టార్‌ ఆర్‌.శివరామ్‌ ప్రసాద్‌ ప్రోత్సాహాన్ని అందించారు. వర్క్‌షాప్‌నకు వనరుల వ్యక్తులుగా మధురైలోని శ్రీసద్గురు సంగీత విద్యాలయం వీణ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.శంకరనారాయణన్‌, అదే సంస్థ గాత్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.కమల కన్నన్‌ హాజరయ్యారు. వీరు శ్రుతి, స్వర, తాళ, లయ అంశాల ప్రాధాన్యతను వివరిస్తూ, శాసీ్త్రయ సంగీతం, భరతనాట్యం వంటి ప్రదర్శన కళల్లో సంగీత పరిజ్ఞానం, లయబద్ధత, భావవ్యక్తీకరణల ప్రాముఖ్యతను తమ అనుభవాల ద్వారా వివరించారు. వర్క్‌షాప్‌ డైరెక్టర్‌, నృత్య విభాగాధిపతి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాదమూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రోగ్రాం కన్వీనర్‌ ఎంవీ విశ్వనాఽథ్‌, కో–కన్వీనర్‌ ఎం.కాశయ్య కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement