సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు ఎంపిక

Oct 29 2026 2:12 AM | Updated on Oct 29 2026 2:12 AM

సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు ఎంపిక

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖపట్నంలోని గీతమ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఈ నెల 31వ తేదీ నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు జరగనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ (పురుషుల) టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ ఈ.త్రిమూర్తి చెప్పారు. ఎంపికై న జట్టులోని సభ్యులను బుధవారం యూనివర్సిటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. జట్టులో అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన యు.శ్రీనివాస ఆరుష్‌ శ్రీవత్స, చిన్నకొండ్రుపాడులోని కాటూరి మెడికల్‌ కళాశాల విద్యార్థి ఎస్‌.సుకేష్‌, కుప్పంలోని పీఈఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స్‌ కు చెందిన వి.కౌశిక్‌ కుమార్‌ రెడ్డి, రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన ఐ. శ్రీఅభినవ్‌, ఎస్‌.వెంకట నిహంత్‌ లను ఎంపిక చేశామని, విజయవాడ ప్రభుత్వ డెంటల్‌ కళాశాలకు చెందిన ఫిజికల్‌ డైరెక్టర్‌ పి.పవన్‌ కుమార్‌ను జట్టు మేనేజర్‌గా ఎంపిక చేసినట్టు చెప్పారు. జట్టులో ఎంపికై న క్రీడాకారులను యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ టి.సాయి సుధీర్‌తో పాటు అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement