దూసుకొస్తున్న అర్నాబ్‌ ముప్పు | - | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న అర్నాబ్‌ ముప్పు

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండాఅధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

నేడు

ఘాట్‌రోడ్డు

మూసివేత

విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవు

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్‌ తుపాను ముప్పు దూసుకొస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి ఈ నెల 28వ తేదీన బాపట్ల – విశాఖపట్నం మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా అధికారు లతో ఆయన సోమవారం తుపాను ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లా ప్రజలకు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. తీవ్ర ఈదురు గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు రోడ్డు ప్రయాణాలు మానుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయ టకు రావాలని స్పష్టంచేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదకర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు తర లిరావాలని కోరారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను ముందస్తుగానే ఆస్పత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పడవలు, టూరిస్ట్‌ బోట్ల రాకపోకలు, గేమ్‌ పార్కులను పూర్తిగా నిలిపివేయాలన్నారు. చెట్లు, శిథిలావస్థ భవనాలు, తాత్కాలిక షెడ్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోకి గానీ, ఉధృతంగా ప్రవహించే కాలువలు, చెరువుల వద్దకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని పేర్కొన్నారు. మూగజీవాలను సురక్షిత పాకల్లో ఉంచాలని, చెట్లకు, స్తంభాలకు కట్టేయరాదని సూచించారు. కోసిన ధాన్యాన్ని రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని పేర్కొన్నారు.

విజయవాడలో 30 పునరావాస కేంద్రాలు

పటమట(విజయవాడతూర్పు): అర్నాబ్‌ తుపాను నేపథ్యంలో విజయవాడలో నగరపాలక సంస్థ ప్రజారక్షణ చర్యలు చేపట్టింది. పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలోని ప్రజలనున సురక్షిత ప్రదేశాలకు తరలించింది. ఈదురు గాలులకు హోర్డింగ్‌లు విరిగి పడకుండా చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో హోర్డింగ్‌లకు ఉన్న బ్యానర్లను మునిసిపల్‌ సిబ్బంది తొలగించారు. మొగల్రాజపురం, గుణదల, సున్నపుబట్టీల సెంటర్‌, క్రీస్తురాజపురం, బందెలదొడ్ది ప్రాంతాల్లో తుపానుపై మైకుల్లో ప్రచారం చేశారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్కిల్‌–1 పరిధిలో పది, సర్కిల్‌ –2లో ఎనిమిది, సర్కిల్‌–3 పరిధిలో 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తీవ్ర తుపాను దృష్ట్యా ఈ నెల 27, 28 తేదీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని విద్యా సంస్థలను ఆదేశించారు. విద్యాసంస్థలకు ఇచ్చే సెలవుల్లో పిల్లలను పూర్తిగా ఇళ్లలోనే ఉంచాలని, విహారయాత్రలకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు. తుపానుపై సోషల్‌ మీడియాలో వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుపాను సంబంధిత సమాచారం, సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసేలా 91549 70454 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అర్నాబ్‌ తుపాను హెచ్చరికతో మంగళవారం దుర్గగుడి ఘాట్‌రోడ్డును మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ శీనానాయక్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొ న్నారు. భక్తులు కనకదుర్గనగర్‌, మహామండపం మీదగా ఆలయానికి చేరుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవస్థాన సిబ్బంది పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ మార్పును భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement