విదేశీయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

విదేశీయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

విదేశీయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి లారీ ఢీకొని వివాహిత మృతి గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి

ఎన్టీఆర్‌ జిల్లా సీపీ రాజశేఖరబాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విదేశీయులకు ఆశ్రయమిచ్చే వారు 24 గంటల్లోగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ/ ఎఫ్‌ఆర్‌ఓ (ఫారనర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషను ఆఫీసరు/ఫారనర్స్‌ రిజిస్ట్రేషను ఆఫీసరు) లో తప్పనిసరిగా నమోదు చేసి పోలీసు అధికారులకు తెలియజేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు తెలిపారు. విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, అతిథి గృహాలు, ఇళ్లు అద్దెకిచ్చే యజమానులు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వారి వద్ద ఆశ్రయం పొందే విదేశీయుల రాక, బస బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా తెలిపాలని సూచించారు. వివిధ దేశాల నుంచి జిల్లాకు వివిధ పనులు, విద్య, వైద్యం, పర్యటన, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులు, పాస్‌పోర్టు, వీసా, వ్యక్తిగత వివరాలు, వసతి వివరాలు, వచ్చిన తేదీ తదితర వివరాలను ’ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫార్‌ నర్స్‌ చట్టం – 2025, సెక్షన్‌ 8 ప్రకారం తప్పనిసరిగా httpr://indianfrso.gov.in వెబ్‌ సైట్‌ ద్వారా నమోదుచేసి 24 గంటలలోగా ఎఫ్‌.ఆర్‌.ఆర్‌.ఓ/ఎఫ్‌.ఆర్‌.ఓ. కార్యాలయాలకు సకాలంలో అందించాల్సిన బాధ్యత ఆశ్రయం కల్పించే సంస్థలపై ఉందని ఆయన తెలిపారు. నిబంధనలు పాటించకుండా రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ జరిమానా, జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు

జగ్గంపేట: లారీ ఢీకొన్న ఘటనలో స్కూటీపై వెళుతున్న మహిళను మృతి చెందింది. ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన పి. జ్యోతి (45) ఒక స్కూటీపై తాను, మరో స్కూటీపై ఆమె ఇద్దరు కుమార్తెలు బుధవారం అన్నవరం సత్యదేవుని దర్శనానికి బయులుదేరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్దకు మధ్యాహ్న సమయానికి చేరుకున్నారు. ఆ సమయంలో జ్యోతి స్కూటీని వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెనకాలే మరో స్కూటీపై వస్తున్న ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రమాదాన్ని గమనించారు. జ్యోతిని అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్ద కుమార్తె నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.

పటమట(విజయవాడతూర్పు): గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పటమట పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వి.పవన్‌ కిషోర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ఆటోనగర్‌ 6వ రోడ్డు, 3వ క్రాస్‌ వద్ద డ్రైనేజీలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు బుధవారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న తాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుని వయస్సు సుమారు 50 నుంచి 53 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. ఆచూకీ తెలిసినవారు పటమట పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, వివరాలకు 9494918585 నంబరులో సంప్రదించాలని కోరారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపేట, గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన అనరాజు కోటయ్య(50) పదేళ్ల క్రితం తన భార్య చనిపోవడంతో కుమారుడు లీలా కృష్ణమూర్తి వద్ద నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోటయ్య చేపలు పట్టేందుకు శనైశ్వరస్వామి గుడి వెనుక వైపు కృష్ణానదిలోకి వెళ్లాడు. రాత్రుయినా తండ్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుమారుడు చుట్టుపక్కల విచారించాడు. తండ్రి కృష్ణానదిలోకి వెళ్లాడని తెలుసుకుని అక్కడకు వెళ్లి వెతకాడు. నది నీటిలో బోర్లా పడిపోయి ఉండటం గమనించాడు. నీటి నుంచి బయటకు తీసి చూసి చనిపోయినట్లు నిర్దారించుకున్నారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి ఊపిరాడక మృతి చెంది ఉంటాడని భావించాడు. మృతుని కుమారుడు కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు బుధవారం నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement