మధురానగర్(విజయవాడ సెంట్రల్): శతాధిక వృద్ధులను సత్కరించడం అభినందనీయమని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఈగల్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. విజయవాడలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం దాత మంగీలాల్ సోలంకి సహకారంతో శతాధిక వృద్ధుల సత్కారం జరిగింది. ముఖ్యఅతిథి ఈగల్ ఐజీ రవికృష్ణ ట్రస్టీలు, దాతలతో కలిసి శతాధిక వృద్ధులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు అధికంగా సైబర్ నేరాలకు గురవుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం శతాధిక వృద్ధులు అన్నవరపు రామస్వామితో పాటు మరో 13 మందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్‌రాజ్ సోలంకి తదితరులు పాల్గొన్నారు.


