ఆత్మ బంధువుకు ఆత్మీయ నివాళి వాడవాడలా మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు సాక్షి, విజయవాడ: సంక్షేమ పాలనంటే ఎలా ఉండాలో.. పాలకుడు ఎలా నడవాలో.. నాయకుడు ప్రజల చెంతకు ఎలా చేరువకావాలో.. చేతల్లో చేసి చూపిన దార్శనీకుడు.. జన హితం కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడు.. దూరమై ఇంకా దగ్గరైనా మహా మనీషి.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఊరూవాడా ఘన నివాళులర్పించాయి. సంక్షేమ సామ్రాజ్య నేతను సేవా కార్యక్రమాలతో స్మరించుకున్నాయి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్య జనం జోహార్లు అర్పించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలతో అలంకరించి సుమాంజలి అర్పించారు. అన్నదానాలు, రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన జ్ఞాపకాలు.. నిత్య వెలుగులంటూ.. ఆ రోజులను జ్ఞప్తికి తెచ్చుకుని మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ఆకాంక్షించారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ విగ్రహా నికి పోలవరం జలాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, గౌతం రెడ్డి, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజా రెడ్డి బెల్లందుర్గ, ఆసిఫ్, అంజిరెడ్డి, రవిచంద్ర ఆళ్ల చెల్లారావు, వంగవీటి నరేంద్ర, సుందర్ పాల్ గౌస్, మొహిద్దీన్ పాల్గొన్నారు. అలాగే మాజీ డెప్యూటీ మేయర్ కార్యాలయం వద్ద అవుతు శ్రీశైలజా రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డు, ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద, సీతన్న పీట గేటు వద్ద వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. డివిజన్ అధ్యక్షుడు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గవ్యాప్తంగా అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ, దుప్పట్లు అందజేత తదితర కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ ఆయా డివిజన్‌ల మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, జి.కొండూరు, మైలవరం, విజయవాడ రూరల్ మండలాల్లో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జి.కొండూరులో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. మైలవరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని జోగి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఐదు మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
● పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని ప్రాంతాలలో మహానేత విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పులిహోర ప్యాకెట్లు పంపిణీ నిర్వహించారు. జెడ్పీటీసీ బాకీ బాబు, పలువురు పార్టీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
● గన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వంశీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం కాలనీ వాసులకు అన్నదానం జరిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు అనగాని రవి, తోట వెంకయ్య, బందెల కిరణ్ రాజ్, జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా రక్తదానం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 100 మందికి పైగా రక్తదానం చేశారు. 5, 12వ డివిజన్‌లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు
ఆత్మ బంధువుకు
వాడవాడలా మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
● దివంగత నేత సేవలను
స్మరించుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
● ఉత్సాహంగా అన్నదానాలు,
సేవా కార్యక్రమాలు
● పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,
పార్టీ ఇన్‌చార్జులు
మౌనం పాటిస్తారా?
ఉయ్యూరు బస్టాండు సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దేవభక్తుని చక్రవర్తి, పార్టీ శ్రేణులు
చిట్టినగర్ జంక్షన్‌లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తున్న వెలంపల్లి,
మాజీ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు
అమీతుమీ
తేలుస్తారా..
ఏపీ ఉద్యోగుల జేఏసీ
జిల్లా చైర్మన్ డీఎస్‌ఎన్ రెడ్డి