ఆర్టీసీ ఉద్యోగులకు ఆధునిక వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు ఆధునిక వైద్య సేవలు

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని సంస్థ వైస్‌–చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ సెంట్రల్‌ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన రూ.22లక్షల విలువైన నూతన ఫుల్లీ ఆటోమేటెడ్‌ ఇమ్యూనో అస్సే అనలైజర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. బాల సుబ్ర హ్మణ్యం మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా వైద్య పరీక్షల్లో 99 శాతానికిపైగా కచ్చితత్వంతో గంట వ్యవధిలో సుమారు 100 నమూనాల ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ ఆధునిక పరికరం ద్వారా థైరాయిడ్‌ ప్రొఫైల్స్‌, ట్యూమర్‌ మార్కర్లు, కార్డియాక్‌ మార్కర్లు, విటమిన్‌ పరీక్షలు, వైరల్‌ మార్కర్లు, ఫాస్టింగ్‌, పీపీబీఎస్‌, ఇన్సులిన్‌, టైప్‌–1, టైప్‌–2 డయాబెటిస్‌, వివిద ఇన్ఫెక్షన వ్యాధుల మార్కర్‌ పరీక్షలు వంటివి నిర్వహించవచ్చని వివరించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మిన్‌) కేఎస్‌బీ రెడ్డి, ఈడీ (ఇంజినీరింగ్‌) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement