రైతుబజార్‌లో సబ్సిడీ బియ్యం కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో సబ్సిడీ బియ్యం కేంద్రం ప్రారంభం

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

రైతుబజార్‌లో సబ్సిడీ బియ్యం కేంద్రం ప్రారంభం బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో అవకతవకలు అరికట్టాలి తల్లిపాలే శిశువుకు అమృతం ఐసీడీఎస్‌ పీడీగా విమల బాధ్యతలు స్వీకరణ

మచిలీపట్నంటౌన్‌: స్థానిక జిల్లా కోర్టు సెంటర్‌ సెంటర్‌ సమీపంలోని రైతు బజార్‌లో సోమ వారం సబ్సిడీ బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టీమ్డ్‌ బీపీటీ బియ్యం కిలో రూ.52, రా బియ్యం రూ.50 చొప్పున విక్రయిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులకు సబ్సిడీ బియ్యం అందజేశారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ, డీఎస్‌ఓ జి.మోహన్‌బాబు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కుంచే నాని, సెక్రటరీ భాస్కర్‌, మార్కిటింగ్‌ శాఖ ఏడీ నిత్యానందం, పీడీఎస్‌ డెప్యూటీ తహసీల్దార్‌ సీహెచ్‌.దుర్గాంజనేయులు, రైతుబజారు ఎస్టేట్‌ అధికారి ఎల్‌.బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లాలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని విజువల్లీ చాలెంజ్డ్‌ యూత్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.ఫణికుమార్‌రెడ్డి ఆరోపించారు. అవకతవకలను అరికట్టి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌ డి.కె.బాలాజీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫణికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవి జనల్‌ మెరిట్‌ లిస్టులో ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై అసిస్టెంట్‌ డైరెక్టర్‌, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఆ శాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీఓ 34 ప్రకారం లోపా లను సరిదిద్దాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని నిజాయితీ గల అధికారితో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పరిశీలించి పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్ర మంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎ.త్రిమూర్తులు, కార్యదర్శి కె.నాగసాయి, కోశాధికారి ఎండీ అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): తల్లిపాలే శిశువు ఆరోగ్యకర జీవితానికి అమృతం అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. శిశువుకు తొలి ఆరునెలలు తల్లిపాలే అందించా లని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియాతో కలిసి ఆదివారం వాల్‌ పోస్టర్‌, కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు ఇతివృత్తంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాల విశిష్టతపై క్షేత్ర స్థాయి ఆరోగ్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎ.శ్రావణబాబు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శరత్‌బాబు, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐ.విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా పనిచేసిన ఎం.ఎన్‌.రాణి ఉద్యోగ విరమణ చేశారు. ఆమె స్థానంలో శ్రీకాకుళం జిల్లా పీడీగా పనిచేస్తూ సెలవుపై ఉన్న ఐ.విమలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమ వారం కలెక్టర్‌ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement