న్యూస్‌రీల్
బడిబాటలో ప్రభుత్వం ఫెయిల్ సర్కారీ స్కూళ్లకు తగ్గుతున్న ఆదరణ ఒకటో తరగతిలో మూడేళ్లలో 15 శాతం క్షీణత యూడైస్ గణాంకాలతో వెలుగులోకి విద్యార్థుల తగ్గుదల విద్యార్థుల సంఖ్య, చేరికల మధ్య వ్యత్యాసాలు
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10
గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32.6287 టీఎంసీలు. ఎగువ కృష్ణానదీ తీరప్రాంతాలనుంచి ప్రాజెక్టుకు 400 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అధికారులు వారికి అమ్మవారి దర్శనం చేయించారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలని, పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని.. జేఎల్‌ఎం కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ఏఎల్‌ఎం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ ఈపీఎప్ హయ్యర్ పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరావు, జె.అనిల్‌కుమార్, ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.మోహనరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.
యూడైస్ గణాంకాలు విద్యార్థుల నమోదుతో వచ్చినవే. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరికలు ఉన్నాయి. చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని చేరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. విద్యార్థుల నమోదుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు.
– యూవీ సుబ్బారావు,
కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి
మచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ఏటా నిర్వహించే ’బడిబాట’ కార్యక్రమం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రచారానికి పెద్దపీట వేస్తూ సర్కారీ బడుల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా, గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా ఒకటో తరగతి ప్రవేశాలు వరుసగా తగ్గుతుండటం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల విశ్వాసం ఇంకా పూర్తిస్థాయిలో పెరగలేదనే సంకేతాలనుఇస్తోంది.
తగ్గుతున్న చేరికలు
జిల్లా అధికారిక వివరాల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 7,981 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో ఈ సంఖ్య 7,509కు తగ్గింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలో జూన్ 30 నాటికి కేవలం 6,802 మంది మాత్రమే చేరారు. మూడేళ్ల వ్యవధిలో 1,179 మంది తగ్గిపోవడంతో దాదాపు 15 శాతం క్షీణత నమోదైంది. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రత్యేక చేరికల డ్రైవ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
గణాంకాల్లో సందేహాలు
చేరికల గణాంకాల విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు 8,352 మంది లక్ష్యాన్ని నిర్ణయించి జూన్ 30 నాటికి 81.44 శాతం చేరికలు పూర్తయ్యాయని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటిస్తున్నారు. గత ఏడాది నమోదైన విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది వెల్లడించిన చేరికల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల గణాంకాల్లోనూ ఇలాంటి తేడాలు ఉండటంతో విద్యా వర్గాలు లెక్కల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
యూడైస్‌లోనూ
యూడైస్ గణాంకాలు కూడా జిల్లాలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. 2024–25లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 96,042 మంది విద్యార్థులు ఉండగా, 2025–26లో అది 87,989కు పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 87,196కు చేరింది. రెండేళ్ల వ్యవధిలో మొత్తం 8,846 మంది విద్యార్థులు తగ్గడం విద్యాశాఖకు హెచ్చరికగా మారింది.
విశ్వాసం పెరగాలంటే..
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరగాలంటే ప్రచార కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, బోధన నాణ్యత మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, విద్యా ఫలితాలపై ప్రత్యేక దృష్టి అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు చేరికల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ముందున్న సవాళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 20 మండలాల్లో 600 వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోని వివిధ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాల్లోని మొదటి తరగతిలో సుమారు 15 వేల మంది ని చేర్చుకునే దిశగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే జిల్లాలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఎనిమిది వేల మార్కును సైతం దాటలేదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. కేవలం విజయవాడ అర్బన్ పరిధిలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అడ్మిషన్ల సంఖ్య దారుణంగా ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై విద్యాశాఖ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.


