విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
ప్రొటోకాల్ వివాదం..
హైవేలపై నిత్యం ప్రమాదాలు..
తుది దశకు జాతీయ క్రీడలు
అభివృద్ధి పనుల పరిశీలన
ఈవీఎం గోడౌన్ తనిఖీ
ఎన్టీఆర్ జిల్లా
u8లో
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
● అనుమతి లేకుండా ఎస్సీ వసతి గృహం
కూల్చివేశారని ఆరోపణ
● సోషల్ వెల్ఫేర్ డీడీ నిర్లక్ష్య
ధోరణిపై ధ్వజం
● ప్రొటోకాల్ పాటించడం
లేదంటూ పోడియం వద్ద నిరసన
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో పలు అంశాలపై నిలదీసిన సభ్యులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దక్షిణ అమెరికాలోని మౌంట్ అకోంకాగ్వా (6,962 మీటర్ల ఎత్తు) శిఖరాన్ని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ యూత్ సర్వీసెస్ కమిషనర్ ఎస్.భరణి ఈ నెల 20వ తేదీన అధిరోహించారు. శాప్ ఎండీగా ఉన్న అఽధికారి తొలిసారిగా అకోంకాగ్వా శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారని, తద్వారా ఆమె రాష్ట్రంలోని క్రీడాకారులకు, యువతకు ప్రేరణగా నిలిచారంటూ శాప్ ఉద్యోగులు భరణిని అభినందనలు తెలిపారు. భరణిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని యువత క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో ఉన్న ఎస్సీ వసతి గృహాన్ని అనుమతులు లేకుండా కూల్చివేసి, విద్యార్థులను దీనస్థితిలోకి నెట్టిన పరిస్థితులపై గురువారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశంలో రగడ జరిగింది. మొవ్వలోని 90 మంది విద్యార్థులు ఉన్న బాలుర వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరిందని, అయితే ఈ భవన నిర్మాణానికి సంవత్సరం క్రితమే నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్.. విద్యార్థులు సంక్రాంతి సెలవులకు వెళ్లిన అనంతరం అర్ధాంతరంగా అనుమతులు లేకుండా కూల్చివేశారని జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు వేమూరి పరిశుద్ధరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. సెలవుల అనంతరం విద్యార్థులు వసతి గృహానికి వస్తే కనీసం నీడ కూడా లేకుండా పోయిందని, వారు ఎక్కడ ఉండాలని ఆయన ప్రశ్నించటంతో మొవ్వ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారన్నారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ను ప్రశ్నిస్తే అసలు మీరు ఎవరు, ఎందుకు అడుగుతున్నారు, ఏమైనా ఉంటే కలెక్టర్‌తో మాట్లాడాలని నిర్లక్ష్యంగా చెప్పారన్నారు. దీంతో సభ్యులు వసతి గృహం విద్యార్థులను వీధిన పడేసి అర్ధాంతరంగా భవనాన్ని కూల్చటం ఏమిటని, కొద్దిసేపు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులను సభ్యులు ప్రశ్నించారు. జ్వరం కారణంగా ఈ సమావేశానికి హాజరుకాని సాంఘిక సంక్షేమశాఖ డీడీ వైఖరిని సభ్యులు తప్పుపట్టారు. వెంటనే డీడీకి కలెక్టర్ ద్వారా మెమో ఇప్పించాలని తీర్మానం చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమశాఖ డీడీపై చర్యలు తీసుకునేలా కలెక్టర్‌తో మాట్లాడాలని సీఈవోకు సూచించారు.
● రెడ్డిగూడెం మండలంలో కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో బాలికలతో కూటమి నాయ కులు నృత్యాలు చేయటం హేయంగా ఉందని దీనిపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకుంటే తాను కోర్టును ఆశ్రయిస్తానని రెడ్డిగూడెం జెడ్పీటీసీ సభ్యుడు పాలంకి విజయభాస్కరరెడ్డి అన్నారు.
● జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ గరికపాటి శ్రీదేవి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పించటం వల్ల వ్యవసాయ పనుల నిమిత్తం కూలీల కొరతగా ఉంటుందని దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు.
● మైలవరం, తిరువూరు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మామిడి రైతులు నకిలీ పురుగుమందులతో ఆర్ధికంగా నష్టపోతున్నారని ఎరువుల షాపులను విస్తృతంగా తనిఖీలు చేసి నాణ్యమైన పురుగు మందులు విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు కోరారు.
● కృత్తివెన్ను మండలంలో వరిసాగు కోసం అధికారులు సాగునీరు అందించలేమని క్రాప్ హాలిడే ప్రకటించనున్న నేపథ్యంలో రైతులకు లాభసాటిగాఉండే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి అధికారులను కోరారు.
అధికారులు హాజరు కాకపోతే ఎలా?
ప్రతి సమావేశానికి ఏలూరు జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరూ హాజరుకాకపోతే తమ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ముసు నూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్ సభ దృష్టికి తీసుకువచ్చారు. గన్నవరం జెడ్పీ హైస్కూల్ వద్ద గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మకాలు జరుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్ రాణి కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: జాతీయ రహదారులపై టిప్పర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాల నివారణకు పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాటించడంలో లారీ డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సుమారు నెల రోజుల క్రితం గుంటుపల్లి వద్ద టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మధిరకు చెందిన బాబూరావు మృతి చెందగా, ఆయన భార్యా కుమారు డు గాయపడ్డారు. ఆ సమయంలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రమాదాల నివారణకు లారీ ఓనర్లు, డ్రైవర్లకు విధివిధానా లు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థు లు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు రోడ్లపై ప్రయాణించే సమయాల్లో లారీలను అనుమతించబోమన్నారు. రెండు వారాల క్రితం తుమ్మలపాలెం వద్ద రెండు టిప్ప ర్లు ఢీకొనగా, జూపూడి వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలు ఆ వాహనాలకు నో ఎంట్రీ సమయంలో జరగడం గమనార్హం
పోలీసుల నిబంధనలు ఇలా..
ఉదయం 7గంటల నుంచి 10గంటలు, సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు విజయవాడ వైపు లారీలకు అనుమతి లేదు. పోలీసుల ఆదేశాలు కొందరు పాటిస్తున్నా, మరికొందరు పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. తుమ్మలపాలెం వద్ద బుధవారం నో ఎంట్రీ సమయంలోనే ముందు వెళ్లున్న టిప్పర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వచ్చిన టిప్పర్ ఢీకొని పాక్షికంగా దెబ్బతింది. ఎవరికీ గాయాలు కానప్పటికీ నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వేధిస్తున్న పోలీస్ సిబ్బంది కొరత..
పోలీసు అధికారులు ప్రమాదాల నివారణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేసేందుకు పోలీస్ సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు సమాచారం. ఉన్న కొద్దిపాటి పోలీసులు హైవే పక్కన ఉన్న పాఠశాలల వద్ద ఉదయం సాయంత్రం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, మరికొంతమంది పొలిటికల్ లీడర్ల పర్యటనలు, సభలు, సమావేశాల వద్ద ఉండాల్సి వస్తోంది. దీంతో ప్రత్యేకంగా లారీలను అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండటం లేదు. మండలంలో 30, 65వ నంబర్ హైవేలు ఉండటం, ఇబ్రహీంపట్నం, జి. కొండూరు మండలాల నుంచి సుమారు 500 క్రషర్ లారీలు, 400 బూడిద లారీలు రోజూ రాకపోకలు చేస్తుంటాయి. వాటిని అదుపు చేసేందుకు పోలీస్ సిబ్బందిని పెంచాల్సి ఉంది.
గుంటుపల్లిలో స్కూటీని ఢీకొని డివైడర్‌పైకి దూసుకెళ్లిన టిప్పర్ (ఫైల్)
7
జిల్లా పరిషత్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు స్ఫూర్తి స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్నప్పటికీ ఆ పుస్తకాల పంపిణీలో జెడ్పీటీసీ, ఎంపీపీలను ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించటం లేదని దీనిపై అధికార పార్టీ నాయకులకు వంత పాడుతున్నారని సభ్యులు ఆరోపించారు. ముసునూరు జెడ్పీటీసీ సభ్యుడు వరికూటి ప్రతాప్ మాట్లాడుతూ ముసునూరు మండలంలోని పాఠశాలలో స్టడీ మెటీరియల్ పంపిణీ సమయంలో ప్రొటోకాల్ పాటించటం లేదని ఆరోపించారు. ఏ పదవి లేని అధికార పార్టీ నాయకులతో పుస్తకాలు పంపిణీ చేయటం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అలాగే కంచికచర్ల, నందివాడ, గుడివాడ జెడ్పీటీసీ సభ్యులు వేల్పుల ప్రశాంతి, కందుల దుర్గాకుమారి, గోళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ అండ్‌బీ అధికారులు శిలాఫలకాల్లో ప్రొటోకాల్ ప్రకారం తమ పేర్లు ఉండాల్సి ఉండగా ప్రొటోకాల్‌లో లేని నాయకుల పేర్లు ముద్రిస్తున్నారని ఇది తమకు ఎంతో అవమానమని పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
మండలం గుండా వెళ్తున్న రెండు హైవేలపై ప్రతి రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఇటీవల కాలంలో గుంటుపల్లి వద్ద జరిగిన టిప్పర్ ప్రమాదంలో ఓ కుటుంబం పెద్దని కోల్పోగా.. స్కూల్ ఆటోను ఢీకొన్నప్పటికీ అదృష్టవశాత్తూ విద్యార్థులకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా రు. ఆంక్షలు విధించిన తర్వాత కూడా జూపూడిలో లారీ ఢీకొని విజయవాడ ఇస్లాం పేటకు చెందిన మన్సూర్ బేగ్ మృతి చెందాడు.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ జాతీయ అండర్–14 బాలికల కబడ్డీ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి.
నందిగామరూరల్: మండలంలోని కంచల గ్రామంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ ను గురువారం కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


