మోపిదేవి ఆలయానికి చెక్క రథం సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు రూ. కోటికి పైగా ఖర్చు చేసి టేకు చెక్కతో తయారు చేసిన రథంను ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు గురువారం అందజేశారు. నూతనంగా తయారు చేసిన టేకురథాన్ని ఉదయం ప్రముఖుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాత నారాయణరావు మాట్లాడుతూ టేకురథం స్వామివారి ఉత్సవాలకు ఉపయోగించేందుకు అనుకూలంగా తయారు చేయించినట్లు తెలిపారు. రథం భద్రపర్చుకునేందుకు కూడా ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, గ్రామ మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ పాల్గొన్నారు.


