ఏపీ ఎన్జీఓ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన సంవత్సరంలో స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేద్దామని తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు అన్నారని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. సోమవారం ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్జీఓ సంఘ క్యాలెండర్‌ను, డైరీ 2026ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ సంఘం జనరల్ సెక్రటరీ డీవీ రమణ, ఏపీ యూటీఎఫ్ ప్రెసిడెంట్ నక్కా వెంకటేశ్వర్లు, ఏపీ ఎస్టీయూ ప్రెసిడెంట్ ఎం.రఘునాథరెడ్డి, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (257) ప్రెసిడెంట్ జి.హృదయరాజు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (1938) ప్రెసిడెంట్ మంజుల, ఏపీపీటీడీ (ఎన్‌ఎంయూ అసోసియేషన్) ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వెంకటేశ్వర్లు, ఏపీ సీపీఎస్ ప్రెసిడెంట్ సతీష్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ప్రెసిడెంట్ జానీ పాషా తదితరులు ఉన్నారు.


