నీటి సమస్య పరిష్కారానికే జలశక్తి హ్యాక్‌థాన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ వైఆర్‌ఎస్ రావు
పెనమలూరు: జల సమస్యల పరిష్కారాలను కనుగొని, నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జలశక్తి హ్యాక్‌థాన్–2025 ముఖ్య ఉద్దేశమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్‌ఎస్ రావు తెలిపారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జలశక్తి మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సస్, రివర్ డెవల్‌మెంట్ శాఖల సహకారంతో జలశక్తి హ్యాకథాన్–2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఆర్‌ఎస్ రావు మాట్లాడుతూ నీటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పది లైన్లతో జలశక్తి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సాంకేతికతతో అధిగమించగలం..
ఆర్‌టీజీఎస్ సీఈవో ప్రఖర్‌జైన్ మాట్లాడుతూ దేశంలో వనరులు తక్కువగా ఉన్నా సాంకేతికతతో సమస్యను అధిగమించగలుగుతామని అన్నారు. విద్యార్థులు పరిశోధనలు చేసి వాస్తవ సమస్యలకు గుర్తించి పరిష్కారం చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ ఎన్.జ్యోతికుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఆకలి నుంచి హరిత విప్లవం పైపునకు సివిల్ ఇంజినీర్లు తీసుకు వెళ్లారన్నారు. జాతీయ నీటి నిపుణుడు ఎ.వరప్రసాదరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీ విజయ్‌కుమార్, కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, వర్సిటీ సివిల్ హెడ్ డాక్టర్ వి.మల్లికార్జున, భూగర్భశాఖ నిపుణులు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌కు ప్రజల నుంచి 60 ఫిర్యాదులు అందా యి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎం.రాజారావు, కై ం ఏడీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు అందకున్నారు. అనంతరం వాటిని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్లో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కాగా గ్రీవెన్స్‌లో భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 27, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 5, మహిళా సంబంధిత నేరాలపై 3, దొంగతాలకు సంబంధించి 5, వివిధ సమస్యలు, సంఘటనలకు సంబంధించి 10, మొత్తం 60 ఫిర్యాదులు అందాయి.
మచిలీపట్నంఅర్బన్: ఏపీలో 104 సేవలను నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య తీరును నిరసిస్తూ సాగుతున్న ఉద్యోగుల ఉద్యమానికి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్. ఫణికుమార్ ఒక ప్రకటనలో కోరారు. భవ్య హెల్త్ సర్వీస్ యాజమాన్యం గత ఏడు నెలలుగా కార్మికులను పూర్తిగా దోపిడీ చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గత యాజమాన్యం ఇచ్చిన చివరి నెల వేతనాన్ని కొనసాగించాల్సిన బాధ్యతను విస్మరించి, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి సమస్య పరిష్కారానికే జలశక్తి హ్యాక్‌థాన్


