రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అవార్డు
పటమట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. లక్ష్మీకాంతం నేపాల్‌లోని ఖాట్మాండులో వరల్డ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ నుంచి ఎస్‌డీఈ చాంపియన్ బహుమతిని అందుకున్నారు. ఈ నెల 28వ జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్, మాజీ రాయబారి డాక్టర్ రాంభక్త ఠాకూర్, మాజీ పర్యాటక మంత్రి యాంకిల షెర్పా, మాజీ మహిళా, శిశు సంక్షేమ మంత్రి భగవతి చౌదరి, నేపాల్ మాజీ సంస్కృతి, పౌర విమానయాన మంత్రి ఆనంద ప్రసాద్ పోఖారెల్ సమక్షంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
గుడ్లవల్లేరు: లిపిడోమిక్స్ వినూత్న పరిశోధనలు అంశంపై వి.వి.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గుడ్లవల్లేరులోని ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మిచిగన్ వేన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ పి.గోవిందయ్య హాజరయ్యారు. సాంకేతికత ద్వారా ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైలింగ్‌లో జరుగుతున్న వినూత్న పరిశోధనలు అనే అంశంపై విలువైన ఉపన్యాసం అందించారు. లిపిడోమిక్స్ రంగంలో ఈ ఆధునిక విశ్లేషణ పద్ధతుల ప్రాముఖ్యతను, ఔషధ పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల్లో వాటి వినియోగాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందయ్యను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.


